రొమ్ము కేన్సర్‌ గుర్తించేందుకు జాకెట్‌

CMET Develops Jacket To Find Breast Cancer - Sakshi

రొమ్ము కేన్సర్‌ గుర్తింపునకు సంప్రదాయ మమోగ్రఫీ కంటే చౌకైన పద్ధతిని తమ సంస్థ సిద్ధం చేసిందని సీమెట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌.ఆర్‌.మునిరత్నం తెలిపారు. రొమ్ము కేన్సర్‌ను గుర్తించేందుకు జాకెట్‌ ఆకారంలో ఉండే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ’సాక్షి’కి తెలిపారు. రొమ్ము కేన్సర్‌ గుర్తించేందుకు ఉపయోగించే మమోగ్రఫీ కోసం ప్రత్యేక యంత్రాలు అవసరమవుతాయని.. వీటి కొనుగోలు, నిర్వహణలకూ భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు.

దీనికంటే ఎన్నో రెట్లు తక్కువ ఖర్చుతోనే తమ జాకెట్‌ రొమ్ము కేన్సర్‌ కణతులను గుర్తించగలదని వివరించారు. కేరళలోని త్రిశూర్‌లో ఇప్పటికే 200 మందిపై పరీక్షించి కచ్చితమైన ఫలితాలు సాధించామన్నారు. కార్యక్రమంలో నార్త్‌ కరొలీనా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ విక్టర్‌ వెలియాడిస్, ఐఐసీటీ డైరెక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్, సీమెట్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ రతీశ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top