
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడకు వెళ్లనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం విజయవాడకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మకు కేసీఆర్ ముక్కుపుడక సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 11.30 గంటలకు కేసీఆర్ కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. అనంతరం కేసీఆర్ రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు కానుకలు సమర్పిస్తానని కేసీఆర్ ఉద్యమ సమయంలో మొక్కుకున్నారు. ఇప్పటికే తిరుమల శ్రీవారికి సాలిగ్రామహారం, కంఠాభరణం, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ రెండవసారి విజయవాడలో పర్యటిస్తున్నారు.