'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్' | cm kcr encouraging defections, says mallu bhatti vikramarka | Sakshi
Sakshi News home page

'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్'

Oct 30 2014 7:54 PM | Updated on Mar 22 2019 6:16 PM

'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్' - Sakshi

'ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్'

టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

హైదరాబాద్: టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి, భయపెట్టి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. టీఆర్ఎస్ లో చీలిక వస్తుందన్న ఆందోళన, అభద్రతాభావంతోనే కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించారు.

ఎన్నికలు-ఓట్లు-అధికారం తప్ప కేసీఆర్ కు ప్రజల బాధలు పట్టవన్నారు. అందుకే స్థానికత అంశంపై ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానికతపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement