ఇద్దరు న్యాయవాదులపై సీఐడీ చార్జిషీట్‌ | CID chargesheet on two advocates | Sakshi
Sakshi News home page

ఇద్దరు న్యాయవాదులపై సీఐడీ చార్జిషీట్‌

Aug 28 2017 3:03 AM | Updated on Apr 4 2019 4:44 PM

సంచలనం రేపిన మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్‌ దందాలో ఆయనకు బీనామీలుగా ఉన్న ఇద్దరు న్యాయవాదులు జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు కేసుల్లో

మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసు 
 
కరీంనగర్‌ లీగల్‌: సంచలనం రేపిన మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్‌ దందాలో ఆయనకు బీనామీలుగా ఉన్న ఇద్దరు న్యాయవాదులు జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు కేసుల్లో నిందితులుగా చూపుతూ సీఐడీ అధికారులు కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. అక్రమ ఫైనాన్స్‌ వ్యవహారంలో మోహన్‌రెడ్డితో పాటు అతని బంధువులు, అనుచరులు మాత్రమే ఇప్పటివరకు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలోని మూడు కేసుల్లో ఇద్దరు న్యాయవాదులను కూడా నిందితులుగా చేర్చారు.

కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఈ రెండు కేసుల్లో.. గతంలో జిల్లా కోర్టులో ఏజీపీగా బాధ్య తలు నిర్వర్తించిన న్యాయవాదిని కూడా నిందితుడిగా చూపారు. వన్‌టౌన్‌ లో నమోదైన కేసులో బయట దేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురైనవారి పరిహారం కేసులు చూసే మరో న్యాయవాదిని చేర్చా రు. మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులు సదరు లాయర్ల పేర రిజిస్టరయినట్లు తేలడంతో వీరిని నిందితులుగా పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement