breaking news
Illegal property case
-
అక్రమ సొమ్ముతో ‘రియల్’ బిజినెస్
సాక్షి ప్రతినిధి, ఏలూరు/తణుకు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఐఎఫ్ఎస్ అధికారి ముత్యాల రాంప్రసాదరావు అక్రమ లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అక్రమ సొమ్ముతో పశ్చిమగోదావరి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. భార్య పేరుతో.. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించి రూ.వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని రియల్టర్లు, ఫైనాన్షియర్లు.. రాంప్రసాద్‌కు బినామీలుగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మంగళవారం తణుకు, విశాఖ, న్యూఢిల్లీ, మీరట్‌లలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ.10.72 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు రూ.37.25 లక్షల నగదు.. పలు బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.150 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ముత్యాల రాంప్రసాదరావుపై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. రాంప్రసాదరావు అక్రమ ఆర్జనకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆయన భార్య ఆకుల కనకదుర్గ దగ్గరుండి చూసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది. -
ఇద్దరు న్యాయవాదులపై సీఐడీ చార్జిషీట్
మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసు కరీంనగర్ లీగల్: సంచలనం రేపిన మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో ఆయనకు బీనామీలుగా ఉన్న ఇద్దరు న్యాయవాదులు జగన్మోహన్రెడ్డి, శ్రీనివాస్‌లను మూడు కేసుల్లో నిందితులుగా చూపుతూ సీఐడీ అధికారులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో మోహన్‌రెడ్డితో పాటు అతని బంధువులు, అనుచరులు మాత్రమే ఇప్పటివరకు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వాటిలోని మూడు కేసుల్లో ఇద్దరు న్యాయవాదులను కూడా నిందితులుగా చేర్చారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ రెండు కేసుల్లో.. గతంలో జిల్లా కోర్టులో ఏజీపీగా బాధ్య తలు నిర్వర్తించిన న్యాయవాదిని కూడా నిందితుడిగా చూపారు. వన్‌టౌన్ లో నమోదైన కేసులో బయట దేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురైనవారి పరిహారం కేసులు చూసే మరో న్యాయవాదిని చేర్చా రు. మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులు సదరు లాయర్ల పేర రిజిస్టరయినట్లు తేలడంతో వీరిని నిందితులుగా పేర్కొన్నారు.