బైక్పై పారిపోతుండగానే అడ్డుకునే యత్నం.. | CI balanagireddy statement on suryapet incident | Sakshi
Sakshi News home page

బైక్పై పారిపోతుండగానే అడ్డుకునే యత్నం..

Apr 4 2015 10:47 AM | Updated on Aug 11 2018 8:11 PM

బైక్పై పారిపోతుండగానే అడ్డుకునే యత్నం.. - Sakshi

బైక్పై పారిపోతుండగానే అడ్డుకునే యత్నం..

దుండగుల ఎదురు కాల్పుల్లో గాయపడ్డ రామన్నపేట సీఐ బాల గంగిరెడ్డి ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్ :  దుండగుల ఎదురు కాల్పుల్లో గాయపడ్డ రామన్నపేట సీఐ బాల గంగిరెడ్డి ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  శనివారం ఉదయం దుండగులు బైక్పై పారిపోతుండగానే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశామని సీఐ తెలిపారు.  ఎడ్లబండి అడ్డు రావటంతో దుండగులకు తమపై కాల్పులు జరిపేంత సమయం దొరికిందన్నారు.

దుండగులతో తాము తీవ్రస్థాయిలో ప్రతిఘటించామని, ఎదురు కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు సీఐ తెలిపారు.  కాల్పుల్లో బాల గంగిరెడ్డి పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.  కాగా సూర్యాపేట బస్టాండ్లో బుధవారం అర్థరాత్రి పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగులు ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement