చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి

Child Friendly Court Special judge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఘాయిత్యాల బారినపడిన చిన్నారులకు సత్వర న్యాయం అందించడానికి దేశంలోనే తొలిసారిగా నగరంలో ఏర్పాటైన చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిని కేటాయించనున్నారు. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హాకా భవన్‌లో ఉన్న ఈ కోర్టును సందర్శించిన హైకోర్టు సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలంటే ప్రత్యేక న్యాయమూర్తి అవసరమన్న పోలీసుల ప్రతిపాదనపై సీజే సానుకూలంగా స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టుతో పాటు భరోసా కేంద్రం, షీ–టీమ్స్‌ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, కొత్వాల్‌ అంజనీకుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top