చారిత్రక కట్టడం చార్మినార్‌కు ఇటీవల కొన్ని మరమ్మత్తులు ప్రారంభమయ్యాయి. కట్టడంలోని మసకబారిన నాలుగు మినార్‌లకు ప్రస్తుతం కెమికల్ ట్రీట్‌మెంట్ సాగుతోంది.
హైదరాబాద్ : చారిత్రక కట్టడం చార్మినార్‌కు ఇటీవల కొన్ని మరమ్మత్తులు ప్రారంభమయ్యాయి. కట్టడంలోని మసకబారిన నాలుగు మినార్‌లకు ప్రస్తుతం కెమికల్ ట్రీట్‌మెంట్ సాగుతోంది. చార్మినార్‌కున్న నాలుగు మినార్‌లు వాయు కాలుష్యం బారినపడి తన సహజత్వాన్ని కోల్పోతున్నాయి. చార్మినార్ కట్టడం మసకబారుతుందని పురాతత్వ శాఖ అధికారులు 2005లో కెమికల్ ట్రీట్‌మెంట్‌ను చేపట్టారు. చార్మినార్ రెండో అంతస్తు వరకు ట్రీట్‌మెంట్ పూర్తయింది. మిగిలిన మినార్‌లకు ప్రస్తుతం మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.
మధ్య యుగపు వాస్తు శైలికి దర్పణం
1591-92లో హైదరాబాద్ నవాబు మహ్మద్ కులీకుతుబ్‌షా చార్మినార్ను నిర్మించారు. గానుగ సున్నంతో గ్రానైట్ రాళ్లను ఉపయోగించి నాలుగు వైపులా నాలుగు దిక్కులను సూచించేలా 11మీటర్ల వెడల్పు...11.5 మీటర్ల ఎత్తు కలిగిన పెద్ద కమాన్లు...మధ్య భాగంలో రెండో అంతస్తు వరకు లేచిన గుమ్మటం...మొదటి అంతస్తులో చుట్టూ గదులు...బయటి వైపునకు, లోపలి వైపునకు తొంగిచూడడానికి వీలుగా కమాన్‌లతో చార్మినార్‌ను నిర్మించారు. మినార్‌లపై వివిధ ఆకృతులు, అలంకరణలను సున్నపు గారతో అతి సున్నితంగా తీర్చిదిద్దారు. మధ్య యుగపు వాస్తు శైలికి చార్మినార్ నిలువెత్తు దర్పణం.


