రేవంత్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు | charge sheet on revanth reddy | Sakshi
Sakshi News home page

రేవంత్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు

Dec 19 2014 3:32 PM | Updated on Aug 15 2018 9:06 PM

రేవంత్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు - Sakshi

రేవంత్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాజాగా రేవంత్ పై న్యాయవాది గోవర్ధన్ రెడ్డి ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రేవంత్ పై ఐపీసీ 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అందుకు సంబంధించిన చార్జిషీట్ ను నాంపల్లి కోర్టుకు సమర్పించారు.

 

రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేయాలని కోర్టుకు పోలీసులు విన్నవించారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో రేవంత్ కు కోర్టు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement