చలాకి చంటి కారుకు ప్రమాదం

Chalaki Chanti Car Accident at Kodad - Sakshi

సాక్షి, కోదాడ: సినిమా వాళ్లనే కాదు టీవీ నటులను కూడా ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, షూటింగ్‌లో అపశ్రుతుల కారణంగా పలువురు యువ హీరోలు గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ‘జబర్దస్త్’ ఫేం చలాకి చంటి పెద్ద ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న చలాకి చంటి కారు లారీని వెనక నుంచి ఢీకొంది. మంగళవారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా కోదాడ కొమరబండ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. కాగా, గతేడాది జూన్‌ నెలలో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ వద్ద జరిగిన కారు ప్రమాదం నుంచి చలాకి చంటి సురక్షితంగా బయటపడ్డాడు. (చదవండి: సీన్లో ‘పడ్డారు’)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top