'కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ధి కోసమే' | Central Government supports to telangana state government, says Bandaru Dattatreya | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ధి కోసమే'

Mar 19 2015 1:02 PM | Updated on Sep 2 2017 11:06 PM

'కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ధి కోసమే'

'కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల్లో లబ్ధి కోసమే'

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్లో స్పందించారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం హైదరాబాద్లో స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేసీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రానికి కేంద్రంతోపాటు తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా దత్తాత్రేయ స్పష్టం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్కు గుణపాఠం కావాలని దత్తాత్రేయ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement