
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. ప్రతి ఏడాది 'అలయ్ బలయ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు చాలామంది హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆహ్వానం అందించగా.. ఇప్పుడు హీరో నాగార్జునని కూడా దత్తాత్రేయ ఆహ్వానించారు. స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లి పత్రిక అందజేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీల్లోకి వచ్చేసిన రెండు తెలుగు సినిమాలు)
ప్రతి ఏడాది దసరా నాడు సంప్రదాయబద్ధంగా 'అలయ్ బలయ్' వేడుక నిర్వహిస్తుంటారు. తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారు. పండుగ సందర్భంగా సామరస్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వర్గ, మత, రాజకీయ భేదాలు మరచి అందరూ ఒక్కచోట చేరడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈసారి అక్టోబరు 3న హైదరాబాద్‌లో ఈ వేడుక జరగనుంది.
(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)