
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి పలు సినిమాల వచ్చాయి. వాటిలో మహావతార్ నరసింహా, కన్యాకుమారి, కొత్త రంగుల ప్రపంచం లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజయ్యాయి. అలానే ఎలియో, 28 ఇయర్స్ లేటర్ తదితర హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మలు కూడా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఇవి కాకుండా మరో రెండు తెలుగు చిత్రాలు కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీల్లోకి రావడం విశేషం.
(ఇదీ చదవండి: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప)
గత నెల 1వ తేదీన థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా 'నీ బంధీనైపోయా'. అసలు ఇది ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా తెలీదు. చిన్న నటీనటులతో తీసిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల పాటు సాగే ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కించారు. జానకి అనే అమ్మాయి.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్లిపోయి బతకాలనుకుంటుంది. కానీ ఓ వ్యక్తి ఈమెని కిడ్నాప్ చేస్తాడు. ఇంతకీ అతడెవరు? ఈమెనే ఎందుకు బంధించాడు? అనేదే మిగతా స్టోరీ.
అలానే ఈ ఏడాదే థియేటర్లలో రిలీజైన '4 గర్ల్స్' అనే సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ఇది రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూడొచ్చు. శ్రుతిక, ఆక్షణ, ప్రిన్స్, అంకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించాడు. అయితే ఇవి చిన్న సినిమాలు. కంటెంట్ పరంగానే అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తుంది. ఆసక్తి బట్టి చూడండి.
(ఇదీ చదవండి: ఓజీ.. జగనే కరెక్ట్: నట్టి కుమార్)