ఒక్క క్లిక్‌తో పూర్తి ఆరోగ్య సమాచారం.. | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా డిజిటల్‌ వైద్య సేవలు 

Published Mon, Nov 11 2019 7:29 AM

Central Government Issued National Digital Health Blueprint - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా డిజిటల్‌ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్రక్టానిక్‌ హెల్త్‌ రికార్డు వ్యవస్థను రూపొందించాలని భావిస్తుంది. తద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకే క్లిక్‌తో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల దేశంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకేచోట నిక్షిప్తం చేసే అవకాశముంది. అందుకోసం తాజాగా ‘నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ బ్లూప్రింట్‌’ను అందుబాటులోకి తెచి్చంది. ఈ బ్లూప్రింట్‌ నివేదికను ప్రజల అవగాహన కోసం విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య విధానం–2017 ప్రకారం అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ డిజిటల్‌ హెల్త్‌ ఉద్దేశమని స్పష్టం చేసింది. దీనివల్ల ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఆన్‌లైన్‌లో వారు అంతకు ముందు పొందిన వైద్య చికిత్సలు, పరీక్షలు అన్నీ ప్రత్యక్షమవుతాయి.

ఆస్పత్రులే నమోదు చేయాలి... 
ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగుల వివరాలను ఇక నుంచి నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ వ్యవస్థలో పొందుపరచాలి. ఈ విషయంపై త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. రోగులకు చేసిన వైద్య పరీక్షలు, అందజేసిన చికిత్సలు, వాడిన మందు లు తదితర వివరాలన్నింటినీ నమోదు చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్‌ సెంటర్లలోనూ ఈ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టే అవకాశముంది. వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను గోప్యంగా ఉంచుతారు. కేవలం చికిత్స పొందేటప్పుడు సంబంధిత డాక్టర్‌కు మాత్ర మే తెలిసేలా ఏర్పాట్లు ఉంటాయి. వ్యక్తిగత సమాచారం కాకుండా ఏ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారో ఈ డిజిటల్‌ హెల్త్‌ సర్వీసెస్‌తో తెలుసుకోవచ్చు. నాణ్యమైన వైద్యాన్ని అందించడం, సార్వత్రిక ఆరోగ్య సేవలను పెంచడం కూడా ఈ సేవల్లో కీలకమైన అంశాలని బ్లూప్రిం ట్‌ వెల్లడించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement