మన సంస్క­ృతిని చాటేలా ఆవిర్భావ వేడుకలు | Celebrations formation Telangana culture | Sakshi
Sakshi News home page

మన సంస్క­ృతిని చాటేలా ఆవిర్భావ వేడుకలు

Jun 2 2016 2:30 AM | Updated on Sep 2 2018 4:16 PM

మన సంస్క­ృతిని చాటేలా ఆవిర్భావ వేడుకలు - Sakshi

మన సంస్క­ృతిని చాటేలా ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ సంస్కృతిని చాటేలా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు....

మందమర్రి ఏరియా జీఎం రాఘవులు
 
రామకృష్ణాపూర్ : తెలంగాణ సంస్కృతిని చాటేలా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నట్లు మందమర్రి ఏరియా జీఎం రాఘవులు తెలిపారు. బుధవారం రామకృష్ణాపూర్‌లోని ఓపెన్‌కాస్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలుపెరుగని ఉద్యమాలు, ఎంతో మంది త్యాగాల ఫలితంగా రాష్ర్టం ఏర్పడిందని,  సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే సీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. వేడుకలలో భాగంగా గురువారం ఉదయం పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ప్రధాన వీధుల గుండా తెలంగాణ రన్ నిర్వహిస్తామని వివరించారు.

అనంతరం ప్రొఫెసర్ జయశంకర్, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన తర్వాత మందమర్రిలోని అన్ని సింగరేణి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరణలు, సాయంత్రం ఉత్తమ కార్మికులకు సత్కారాలు, బహుమతులు, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. కార్మికులు, కార్మిక కుటుంబాలు పెద్దసంఖ్యలో హాజరై ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ గోవిందరాజు, ఆర్‌కే ఓసీ, కేకే ఓసీ  ప్రాజెక్ట్ ఆఫీసర్లు సురేష్, రాంమూర్తి, మేనేజర్ రాధాకృష్ణ, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్, ఫిట్ కార్యదర్శి రాజ్‌కుమార్, నాయకులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.


లక్ష్య సాధనకు అందరు కృషి చేయాలి
మందమర్రి : మందమర్రి ఏరియాలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మికులు కృషి చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ ఎం.రాఘవులు కోరారు. తన చాంబర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మే నెలలో సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. శాంతిఖని గనిలో 35,300 టన్నులు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 2,822 టన్నుల ఉత్పత్తితో కేవలం 8 శాతం సాధించిందని తెలిపారు. 

కేకే-1 గనిలో 20,300 టన్నులు బొగ్గు ఉత్పత్తికి గాను 14,087 టన్నుల ఉత్పత్తితో 69 శాతం సాధించిందని తెలియజేశారు.  కేకే-5 గనిలో 20,300 టన్నులు ఉత్పత్తి నిర్దేశించగా 18,040 టన్నుల ఉత్పత్తితో 89 శాతం సాధించిందని పేర్కొన్నారు. కాసిపేట గనిలో 25,400 టన్నులు నిర్దేశించగా 22,975 టన్నులు ఉత్పత్తితో 90 శాతం సాధించినట్లు తెలిపారు. ఆర్‌కే-1ఎ గనిలో 14,400 టన్నుల ఉత్పత్తి నిర్దేశించగా 8,466 టన్నుల ఉత్పత్తితో 59 శాతం సాధించిందని వివరించారు. వివిధ గనుల ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. సమావేశంలో క ల్యాణిఖని ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్ అధికారి , ఎస్‌వోటు జీఎం, ఏజీఎం , ఐఈడీ,డీజీఎం పర్సనల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement