నగరంలో కిడ్నాప్ కలకలం | Caused kidnapped in the city | Sakshi
Sakshi News home page

నగరంలో కిడ్నాప్ కలకలం

May 29 2015 6:06 AM | Updated on Aug 21 2018 5:46 PM

నగరంలో గురువారం సాయంత్రం ఓ అమ్మారుు కిడ్నాప్‌నకు గురైనట్లు పలువురికి వాట్స్‌యాప్‌లో ఫొటోలు రావడంతో కలకలం రేగింది.

వాట్స్‌యాప్ ఫొటోలతో విచారణ
చివరికి కథ సుఖాంతం

 
 కరీంనగర్ క్రైం : నగరంలో గురువారం సాయంత్రం ఓ అమ్మారుు కిడ్నాప్‌నకు గురైనట్లు పలువురికి వాట్స్‌యాప్‌లో ఫొటోలు రావడంతో కలకలం రేగింది. వీటి ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  సిరిసిల్ల మండలానికి చెం దిన ఓ యువతి రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలంలోని బంధువుల ఇంటికొచ్చింది. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని బంధువుల ఇంటికి బయలుదేరింది. సదరు అమ్మాయికి వరుసకు బావ అయిన యువకుడు మహరాజా బార్ సమీపంలో ఆమెను అటకాయించాడు. ఇంటికి రమ్మని కోరడంతో యువతి నిరాకరించింది.

యు వకుడు ఇంటికి రావాలని లాగడంతో ఆమె కిందపడింది. దీంతో స్థానికులు స్పందించి యువతిని కిడ్నాప్‌నకు ప్రయత్నిస్తున్నారని యువకుడిని నిలదీశారు. భయపడ్డ సదరు యువకుడు పరారయ్యూడు. అక్కడే ఉన్న ఓ ఉపాధ్యాయు డు స్పందించి ఫొటోలు తీసి యువతి కిడ్నాప్ అరుుందని వాట్స్‌యాప్‌లో పలువురికి పంపించాడు. దీంతో ఈ వార్త నగరంలో గుప్పుమంది. అంతేకాకుండా మీడియూసంస్థలకు చేరగా.. పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. రెండు గంటల తర్వాత వారిని గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించగా.. అసలు విషయం తెలిసింది. ఏదో జరుగుతుందని ఫొటోలు తీసి వాట్సప్‌లో పెట్టిన ఉపాధ్యాయుడిని టుటౌన్ ఎస్సై దామోదర్‌రెడ్డి స్టేషన్‌కు పిలిపించి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement