జన గణన సర్వేలో భాగంగా 2015 నవంబర్–డిసెంబర్ మధ్య, వేసవి సెలవుల్లో సర్వేలో పాల్గొన్న టీచర్లకు కాంపెన్షేటరీ క్యాజువల్ లీవ్స్ (సీసీఎల్స్)
సాక్షి, హైదరాబాద్: జన గణన సర్వేలో భాగంగా 2015 నవంబర్–డిసెంబర్ మధ్య, వేసవి సెలవుల్లో సర్వేలో పాల్గొన్న టీచర్లకు కాంపెన్షేటరీ క్యాజువల్ లీవ్స్ (సీసీఎల్స్), ఎర్న్‌డ్ లీవ్స్‌ను(ఈఎల్స్) మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు పీఆర్‌టీయూ–టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి తెలిపారు. నవంబర్, డిసెంబర్‌ల్లో సర్వేలో పాల్గొన్న వారికి సీసీఎల్స్, వేసవి సెలవు ల్లో పాల్గొన్న వారికి ఈఎల్స్‌ను ప్రభుత్వ సెలవు దినాలకు సరిపడా 10 రోజులకు మించకుండా పాఠశాల విద్యాడైరెక్టర్ కిషన్ మంజూరు చేశారని పేర్కొన్నారు. ఎంఈ వోలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు టీచర్లకు సెలవులు మంజూరు చేయవచ్చన్నారు.
టీచర్లు ఆస్తులు వెల్లడించాల్సిన అవసరం లేదు
ఆస్తుల వివరాలను టీచర్లు ప్రకటించాల్సిన అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చినట్లు పీఆర్‌టీయూ–టీఎస్ నేతలు వెల్లడించారు. ఈ మేరకు అధికారులతో మాట్లాడి ఆ ఉత్తర్వులను ఉపసంహరించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.