కారు బోల్తా: ముగ్గురికి గాయాలు | car Roll over in khammam district three injured | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ముగ్గురికి గాయాలు

Apr 25 2016 11:11 AM | Updated on Sep 3 2017 10:43 PM

ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి.

మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఏడీఈ తిలక్‌కు చెందిన కారులో ఆయన భార్య శివలింగాపూర్‌లో ఉన్న శివాలయానికి వెళ్తున్నారు.

మార్గమధ్యంలో వారి వాహనానికి అకస్మాత్తుగా అడ్డువచ్చిన బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న తిలక్ భార్య గాయపడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ పరారు కాగా స్థానికులు క్షతగాత్రురాలిని కారు నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement