నిజామాబాద్‌లో కాలువలోకి దూసుకెళ్లిన కారు.. | Car Rams into Canal in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో కాలువలోకి దూసుకెళ్లిన కారు..

Oct 22 2019 2:22 PM | Updated on Oct 22 2019 2:31 PM

Car Rams into Canal in Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్‌కు చెందిన ఓ కుటుంబం రాళ్లవాగు అందాలు చూసి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వాహనం కమ్మర్‌పల్లి మండలం రాళ్లవాగు దగ్గరకు రాగానే అదుపు తప్పి పక్కనే ఉన్న నీటి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే డోర్‌ ఓపెన్‌ చేసి.. అందులో ప్రయాణిస్తున్న వారిని సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో ముగ్గురు పిల్లలతోపాటు భార్య, భర్త కారులో ఉన్నారు. అనంతరం క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement