మూడున్నర కిలోల బంగారం పట్టివేత | Capture three and a half kg of gold | Sakshi
Sakshi News home page

మూడున్నర కిలోల బంగారం పట్టివేత

Feb 23 2016 3:49 AM | Updated on Sep 2 2018 3:44 PM

బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.

వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఘటన

 వరంగల్ : బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. త్రివేండ్ర ం నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం వరంగల్‌లో ఆగగా, అందులో నుంచి తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన బాలక్రిష్ణన్ సీతారామన్(అయ్యప్పన్) దిగాడు.

అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పోలీసులు పట్టు కొని విచారించారు. అతని బ్యాగులో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో సీతారామన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడి వద్ద బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ మాత్రం లభించింది. ఇదిలా ఉండగా 2014 జూన్‌లోనూ ఇదే వ్యక్తి 2.5 కిలోల బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా అప్పటి వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement