breaking news
Warangal railway police
-
సింహపురిలో ప్రయాణికుడు హఠాన్మరణం
వరంగల్ రైల్వేగేట్: సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వ్యవసాయ కూలీ కోట కృష్ణారెడ్డి(62) సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వెళ్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున బాత్రూంకని వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ప్రయాణికులు గమనించి రైల్వే అధికారులకు సమాచారమందించారు. రైలు వరంగల్ స్టేషన్‌కు చేరగానే పోలీసులు రైలు వద్దకు వచ్చి బోగీలోని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ సీఐ వెంకటరత్నం తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏఎస్సై పరశురాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడున్నర కిలోల బంగారం పట్టివేత
వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన వరంగల్ : బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలను వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. త్రివేండ్ర ం నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రప్తీసాగర్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం వరంగల్‌లో ఆగగా, అందులో నుంచి తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన బాలక్రిష్ణన్ సీతారామన్(అయ్యప్పన్) దిగాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పోలీసులు పట్టు కొని విచారించారు. అతని బ్యాగులో ఎలాంటి బిల్లులు లేకుండా తీసుకొస్తున్న మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు లభించాయి. దీంతో సీతారామన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, అతడి వద్ద బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ మాత్రం లభించింది. ఇదిలా ఉండగా 2014 జూన్‌లోనూ ఇదే వ్యక్తి 2.5 కిలోల బంగారు ఆభరణాలు తీసుకొస్తుండగా అప్పటి వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు.