రీలాక్స్‌ అవుతున్న పార్టీల అభ్యర్ధులు

 Candidates For Parties That Are Relaxing - Sakshi

జోగిపేట(అందోల్‌): అందోల్‌ నుంచి పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం కార్యకర్థలు, ముఖ్యనేతలతోనే గడిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌ శనివారం తన స్వగ్రామమైన వట్‌పల్లి మండలం పోతిరెడ్డిపల్లిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో గడిపారు. పోలింగ్‌ సరళిపై, శాతం, మెజారిటీ తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసారు. తప్పకుండా గెలుపొందుతామన్న ధీమాను వ్యక్తం చేసారు. 

దామోదర సైతం..
సంగారెడ్డిలోని తన ఇంట్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సి.దామోదర రాజనర్సింహా కార్యకర్తలతో చర్చిస్తూ గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సంగారెడ్డికి తరలివెళ్లారు. మండలాల వారిగా పార్టీకి ఎంతెంత పోలయ్యిందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మనమే గెలుపొందుతామని కార్యకర్తలకు ఆయన చెప్పినట్లు సమాచారం. 

మనుమరాళ్లతో బాబూమోహన్‌
జోగిపేట(అందోల్‌): పోలింగ్‌ ముగియడంతో అందోల్‌ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి పీ. బాబూమోహన్‌ తన మనుమరాళ్లు ఆన్యా, శనాయాతో సరదాగా గడిపి రిలాక్స్‌ అయ్యారు. 20 రోజులుగా ప్రచార నిమిత్తం నియోజకవర్గంలోనే ఉండిపోవడంతో ఆయన ఇంటివైపు వెళ్లలేదు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో శనివారం అంతా ఆనందంగా గడిపారు. 

సరదాగా గడిపిన సతీశ్‌బాబు
హుస్నాబాద్‌: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీశ్‌కుమార్‌ శనివారమంతా  కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్‌లోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్‌తో కలిసి సరదాగా మార్నింగ్‌ వాక్‌ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

జహీరాబాద్‌ అభ్యర్థుల విశ్లేషణలు
ముఖ్య నేతలతో సమావేశమైన గీతారెడ్డి
జహీరాబాద్‌: జహీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జె.గీతారెడ్డి శనివారం సైతం బిజీ బిజీగా గడిపారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆమె తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా గీతారెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గం అంతా పర్యటించి అలసిపోయారు. అయినా శనివారం సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహించారు. ఎన్నికల సరళి గురించి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు గీతారెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఆమెకు వివరాలు అందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ మేరకు ఓట్లు పోలయ్యాయనే విషయమై ఆరా తీశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలింగ్‌ జరిగిందని పార్టీ నేతలు వివరించారు. భారీ మెజార్టీతో గెలుపొందుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గీతారెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారు.

మాణిక్‌ రావు సైతం..
నెల రోజులుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.మాణిక్‌రావు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నంత సేపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం సైతం కార్యకర్తలు, నేతలతో గడిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం మాణిక్‌రావు పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్‌ తరలి వెళ్లారు. తన విజయం కోసం శ్రమించినందుకు ఎమ్మెల్సీ ఎం.డి.ఫరీదుద్దీన్‌ను మాణిక్‌రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

 
శ్రేణుల సమక్షంలో సంబరం
కార్యకర్తల సమక్షంలో పెళ్లి రోజు జరుపుకొన్న ఆకుల రాజయ్య, గజమాలతో సన్మానించిన అభిమానులు
మెదక్‌ అర్బన్‌: మెదక్‌ బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదకు వచ్చి.. వినూత్నంగా ప్రచారం నిర్వహించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు ఆకుల రాజయ్య. గత పదిరోజులుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజయ్య శనివారం మెదక్‌లో కార్యకర్తల నడుమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. రాజయ్య, స్వరూపరాణి దంపతులను గజమాలతో సన్మానించారు.

సేద తీరిన సోలిపేట

దుబ్బాకటౌన్‌: గత రెండు నెలలుగా ప్రచారంలో తీరికలేకుండా గడిపిన దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట జ్వరం రావడంతో శనివారం అంతా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నారు. తన వద్దకు వచ్చిన కార్యకర్తలతో పోలింగ్‌ సరళిపై చర్చించారు. 50 వేల పై చిలుకు భారీ మోజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజులుగా  నియోజకవర్గంలోనే ఉంటూ విరామం లేకుండా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు ఎన్నికలు ముగియడంతో తన కూతురు వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఆయన కూతురు సింధు వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా సాక్షితో రఘునందన్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశిస్సులతో తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఇంటిపట్టునే ఖేడ్‌ అభ్యర్థులు
మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌
నారాయణఖేడ్‌: దాదాపు పక్షం రోజులుగా ఎన్నికల ప్రచారంలో గడిపిన ఖేడ్‌ ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం ఇళ్లలోనే ఉండి సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో పోలింగ్‌ సరళిపై చర్చించారు. ఫలితాలు ఎలా ఉంటాయోన్న ఆందోళన ఎవ్వరిలో కనిపించక పోవడం విశేషం. 

సరదాగా గడిపిన సతీశ్‌బాబు
హుస్నాబాద్‌: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీశ్‌కుమార్‌ శనివారమంతా  కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్‌లోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్‌తో కలిసి సరదాగా మార్నింగ్‌ వాక్‌ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

స్నోబాల్‌ ఆడుతూ మన పార్టీ అభ్యర్థి..
నారాయణఖేడ్‌: ఖేడ్‌ నుంచి మన పార్టీ తరఫున పోటీ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మురళీగోవింద్‌ శనివారం స్నోబాల్‌ ఆడి రిలాక్స్‌ అయ్యారు. దాదాపు 20 రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం హైదరాబాద్‌ వెళ్లారు.

మెదక్‌జోన్‌: మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉపేందర్‌ రెడ్డి శనివారం పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలోని తన ఇంటిలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. గత 20 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. కుటుంబ సభ్యులతో ఉపేందర్‌రెడ్డి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top