బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం | cabinet meeting on telangana assembly budget | Sakshi
Sakshi News home page

బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం

Mar 12 2017 8:10 PM | Updated on Aug 11 2018 6:42 PM

సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: రేపు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్డెట్ పై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఆదివారం రాత్రి భేటీ అయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సభలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. నేడు అసెంబ్లీకి సెలవుదిన కావడంతో సోమవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేబినెట్ భేటీలో చర్చించారు. 15, 16 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement