నగరంలోని నార్సింగ్ వెస్టర్న్ కాలనీ శ్రీ విల్లాలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్‌లో సోమవారం తెల్లవారు జామున అంతరాష్ట్ర దొంగలు హల్‌చల్ చేశారు. హిమగిరినగర్లోని రెండు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు దొరికినకాడికి దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం పీరం చెరువు గ్రామపరిధిలోని శ్రీనిలయ విల్లాస్‌లో ఐదుగురు దోపిడిదొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. ఇనుపరాడ్లతో తాళం దర్వాజాను పగులగొట్టి ముందుగా రామక్రిష్ణ ఇంటిలోకి ప్రవేశించారు. దేవుని ఇంట్లో ఉన్న వెండి పూజా సమాగ్రిని తీసుకున్నారు. విల్లాలోనే వాచ్‌మెన్‌ని బంధించి తాళం వేశారు. అక్కడినుంచి నింధితులు జాషువా ఇంట్లోకి ప్రవేశించి అతన్ని బంధించి విలువైన నగదు, నగలు కావాలంటూ దాడిచేశారు.
అనంతరం జాషువా దగ్గర నుంచి కారు తాళాలు తీసుకొని అందులోనే ఉడాయించారు. నిందితులంతా 30 సంవత్సరాలలోపు ఉన్నారని, కేవలం హింధీబాషలోనే మాట్లాడారని బాధితుడు జాషువా పోలీసులకు తెలిపారు.