తెలంగాణ మంత్రులకు క్వార్టర్స్ కేటాయింపు | Bungalows allotted for Telangana ministers | Sakshi
Sakshi News home page

తెలంగాణ మంత్రులకు క్వార్టర్స్ కేటాయింపు

Jun 3 2014 8:05 PM | Updated on Sep 2 2017 8:16 AM

తెలంగాణ మంత్రులకు నివాస భవనాలను కేటాయించారు. బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ లో ఇళ్లను కేటాయించారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు నివాస భవనాలను కేటాయించారు. బంజారాహిల్స్ లోని మంత్రుల క్వార్టర్స్ లో  ఇళ్లను కేటాయించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావుకు ఏడో క్వార్టర్స్ ను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖర్ రావు సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఇద్దరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement