వీధికుక్క దాడిలో బాలునికి తీవ్రగాయాలు | Boy injured by attacking of street dogs | Sakshi
Sakshi News home page

వీధికుక్క దాడిలో బాలునికి తీవ్రగాయాలు

Apr 16 2015 5:07 PM | Updated on Jul 12 2019 3:29 PM

ఆడుకుంటున్న బాలునిపై వీధి కుక్క దాడి చేసి ముఖం, చేతులపై కరిచి గాయపర్చింది.

నల్లకుంట(హైదరాబాద్): ఆడుకుంటున్న బాలునిపై వీధి కుక్క దాడి చేసి ముఖం, చేతులపై కరిచి గాయపర్చింది. వివరాలివీ... మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం. నర్సింహ కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి మల్లాపురం అశోక్‌నగర్‌లో ఉంటోంది. కాగా, గురువారం ఉదయం నర్సింహ, అతని భార్య కూలి పనికి వెళ్లగా వారి కుమారుడు ఎం.నవీన్(6) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క అతని ముఖం, కుడి చేతిపై కరిచి గాయపర్చింది. క్షతగాత్రుడిని ఫివర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement