తెలుగింటి బతుకమ్మ సంబరాల వీడియో  | BJP Teluginti Bathukamma Sambaralu Video Relesed | Sakshi
Sakshi News home page

Oct 9 2018 3:30 AM | Updated on Oct 9 2018 3:32 AM

BJP Teluginti Bathukamma Sambaralu Video Relesed - Sakshi

పేరాల చంద్రశేఖర్‌

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండగ విశిష్టత, ప్రత్యేకతలపై బీజేపీ రూపొందించిన ‘తెలుగింటి బతుకమ్మ సంబరాలు’వీడియోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు పేరాల చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ గ్రామీణ అస్తిత్వాన్ని తెలిపే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలోని న్యాయవాదులు తమ డిమాండ్లను బీజేపీ మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు. ఈమేరకు బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ మల్లారెడ్డిని పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేయగా, వారి డిమాండ్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తామని మల్లారెడ్డి తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement