'కేసీఆర్.. జిన్నాలా మాట్లాడుతున్నారు' | bjp slams kcr over his remarks | Sakshi
Sakshi News home page

'కేసీఆర్.. జిన్నాలా మాట్లాడుతున్నారు'

Aug 7 2014 12:36 PM | Updated on Mar 29 2019 9:24 PM

తెలంగాణను పాకిస్థాన్లా, తనను తాను మహ్మద్ అలీ జిన్నాలా భావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు.

తెలంగాణను పాకిస్థాన్లా, తనను తాను మహ్మద్ అలీ జిన్నాలా భావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయన్నారు. ఒక్కరోజులో సామాజిక సర్వే చేయడం అంటే మానవ సాధ్యమేనా అని ఆయన ప్రశ్నించారు.

తన తప్పులను ఆయన కేంద్రం మీద నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో సాధ్యాసాధ్యాలు ఆయనకు ఎన్నికల ముందు తెలియదా అంటూ ఇంద్రసేనారెడ్డి నిలదీశారు. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టే ధైర్యం కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. మాటలు కాదు..చేతలు కావాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement