బల్దియాపై బీజేపీ కార్యాచరణ

BJP Ready For Municipal Elections In Adilabad District - Sakshi

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జీగా ఎంపీ ‘సోయం’

సాక్షి, ఆదిలాబాద్‌: మున్సిపాలిటీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బల్దియాల్లో పాగా వేయాలని ఆ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి తమ సత్తా చాటాలనే దృఢ సంకల్పంతో ముందుకు కదులుతోంది. పట్టణాల పార్టీ కేడర్‌లో ఇప్పటికే జోష్‌ కనిపిస్తోంది. ఎన్నికలు ఇప్పుడే వచ్చినా ఢీ అనేందుకు సిద్ధమవుతున్నారు.

కార్యాచరణ ఇలా..
త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా  కమలం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గాల వారీగా మున్సిపల్‌ ఎన్నికల కోసం క్లస్టర్‌ ఇన్‌చార్జీలను నియమించింది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ క్లస్టర్‌కు ఇన్‌చార్జీగా ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బా పురావును నియమించింది. దీనికి సంబంధించి రెండు రోజుల కిందే పార్టీ నుంచి ప్రకటన వెలబడింది. పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే ఆదిలా బాద్, నిర్మల్, భైంసా, ఖానాపూర్, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలకు పార్టీ పరంగా ఆయన ఇన్‌చార్జీగా వ్యవహరించనున్నారు. ఆదిలా బాద్, నిర్మల్, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో గతంలో టీఆర్‌ఎస్, భైంసాలో ఏఐఎంఐఎం పార్టీలు గెలుపొందాయి.

ఖానాపూర్‌ మున్సిపాలిటీగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటు టీఆర్‌ఎస్‌తోపాటు అటు ఏఐఎంఐఎంతో పోరుకు సిద్ధమవుతోంది. గతంలో ప్ర త్యక్ష ఎన్నికల ద్వారా ఆదిలాబాద్, నిర్మల్‌ ము న్సిపాలిటీల్లో బీజేపీ గెలుపొందింది. అయితే ఆ తర్వాత జరిగిన పరోక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఈ రెండు మున్సిపాలిటీలతోపాటు మిగతా ము న్సిపాలిటీల్లోనూ నామమాత్రంగా ప్రభావం చూపెట్టింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ఆయా చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావును ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా నియమించడంతో పార్టీ కేడర్‌లో జోష్‌ కనిపిస్తోంది.

పక్కా ప్రణాళిక..
మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వే యాలని చూస్తున్న బీజేపీ తగు ప్రణాళిక రూ పొందిస్తుంది. అయితే రిజర్వేషన్లు ఖరారు త ర్వాతే ఈ కార్యాచరణకు బీజం వేయాలని చూ స్తున్నారు. ఆదిలాబాద్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, రాష్ట్ర నాయకురాలు సు హాసిని రెడ్డి మధ్య అంతర్యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌ రిజర్వేషన్‌ జనరల్‌ ఉన్న పక్షంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ అయినటువంటి సుహాసిని రె డ్డి రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు. ఇం దుకోసం ఆమె పార్టీ పెద్దలను కూడా కలిసిన ట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జిల్లా అ« ద్యక్షుడు పాయల శంకర్‌తో ఆమెకు రాజకీయంగా పొసగకపోవడంతో పరిణామాలు ఎలా ఉం టాయనేది ఆసక్తికరంగా మారింది.

అదే స మయంలో జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ తన అల్లుడు సిద్ధార్థ్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో రంగంలోకి దించడం ద్వారా చైర్మన్‌ పీఠంపై గురిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో బీజేపీ రాజకీయాలు రసకందాయంగా సాగుతున్నా యి. నిర్మల్‌లోనూ బీజేపీకే పటిష్ట కేడర్‌ ఉంది. అక్కడ కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చి బల్దియాలో ప్రభావం చూపాలని ఆ పార్టీలో ఉత్తేజం కనబడుతోంది. ఇక ముథోల్‌ నియోజకవర్గంలో గత పార్లమెంట్‌ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి టీఆర్‌ఎస్‌ కంటే అధిక ఓట్లు సాధించా రు. అయితే భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ప్రభావం ఉంది. దీంతో బీజేపీ ఎంఐఎంతో పోటీగా నిలవనుంది. ఇక కాగజ్‌నగర్‌లోనూ ప్రభావం చూపాలని ఆ పార్టీ ఆశిస్తుంది. కొత్త మున్సిపాలిటీ అయిన ఖా నాపూర్‌లో ఉనికి చాటాలనే ప్రయత్నాలు చేస్తోంది. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top