హైదరాబాద్‌ ఐసిస్‌ కార్యక్షేత్రం కావొద్దు | BJP Kishan Reddy fire on MIM | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఐసిస్‌ కార్యక్షేత్రం కావొద్దు

May 19 2017 1:06 AM | Updated on Jun 4 2019 6:31 PM

హైదరాబాద్‌ ఐసిస్‌ కార్యక్షేత్రం కావొద్దు - Sakshi

హైదరాబాద్‌ ఐసిస్‌ కార్యక్షేత్రం కావొద్దు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఐఎస్‌ ఐఎస్‌ కార్యకలాపాల కేంద్రంగా మారకుం డా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఐఎస్‌ ఐఎస్‌ కార్యకలాపాల కేంద్రంగా మారకుం డా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గురు వారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయ న విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు కౌంటర్‌ ఇంటెలిజెన్స్, ఆక్టో పస్‌ వంటి విభాగాలను పటిష్టం చేయాల న్నారు.

 హైదరాబాద్‌ రక్షణ విషయంలో ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగకుండా ఏకాకిని చేయాలని, ఉగ్రవాద మూలాలను తుడిచి పెట్టేందుకు  పోలీసులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సూచించారు.  నగరం లోని ఐసిస్‌ సానుభూతిపరులు పేలుళ్లకు పాల్పడతామంటూ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement