కీసర ఓఆర్‌ఆర్ జంక్షన్ రహదారిలో బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కీసర (రంగారెడ్డి): కీసర ఓఆర్‌ఆర్ జంక్షన్ రహదారిలో బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, మూడు బైకులపై ఆదివారం ఉదయం కీసర ఓఆర్‌ఆర్ జంక్షన్‌కు చేరుకుని రేసింగ్ నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసి నలుగురు విద్యార్థులు పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, ర్యాష్ డ్రైవింగ్ పేరిట జరిమానా వసూలు చేసి విడుదల చేశారు.