జార్జియాలో చిక్కుకున్న భువనగిరి యువతి శివాణి

Bhuvanagiri Resident Shavani Stopped At Georgia - Sakshi

యాదాద్రి జిల్లా : భువనగిరికి చెందిన శివాణి అనే విద్యార్థిని జార్జియా దేశంలో చిక్కుకుపోయింది. వెంకటేష్, సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా వెళ్లింది. స్థానిక అకాకి త్సెరెటెలి విశ్వవిద్యాలయంలో ఆమె మెడిసిన్ చదువుతోంది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. వెంటనే శివాణి తల్లిదండ్రులకు విద్యార్థులు సమాచారం అందించారు.

దీంతో కూతురుకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి శివాణిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్‌ పోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణిని భారత్‌కు పంపేందుకు నిరాకరించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురు శివాణి భారత్‌కు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసినా.. చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురును ఆదుకోవాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు.

  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top