బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు చెల్లించాలి | BCI students will have to pay full fees | Sakshi
Sakshi News home page

బీసీ విద్యార్థులకూ పూర్తి ఫీజు చెల్లించాలి

Oct 10 2017 4:54 AM | Updated on Oct 1 2018 5:40 PM

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో వెనుకబడిన తరగతుల విద్యార్థులు నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో ఫీజులు మంజూరు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో ఆ సంఘం నేతలు బీసీ లెజిస్లేచర్‌ కమిటీని సోమవారం కలసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రావల్కోల్‌ నరేశ్, కె.నర్సింహా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement