ఈ నెలాఖరు నుంచి ఫీజు చెల్లింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు టెన్త్ పరీక్షల విభాగం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా పబ్లిక్ పరీక్షల ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. అక్టోబర్ 30 నుంచి ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 16 వరకూ ఫీజు చెల్లించవచ్చు. విద్యార్థులందరికీ షెడ్యూల్ వివరాలను తెలియజేయాలని పాఠశాలల ప్రధానోపాద్యాయులు, ప్రిన్సిపాళ్లను పరీక్షల విభాగం ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తారు. మిగాతా అభ్యర్థులంతా అన్ని సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి.
కంపార్ట్‌మెంట్ పరీక్షలు రాసే విద్యార్థులు మూడు సబ్జెక్టుల వరకు ఫీజు రూ.110, అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులకు సాధారణ ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఫీజు రూ.125 ఉంటుంది. ఇదికాకుండా అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన అనంతరం పాఠశాలలు సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా నిర్దేశిత గడువుల్లో ప్రభుత్వానికి చెల్లించాలి. పరీక్ష ఫీజులను పాఠశాలల లాగిన్ ద్వారా యాజమాన్యాలు అధికారిక వెబ్‌సైట్ ఠీఠీఠీ.bట్ఛ.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn లోనే చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.
ఫీజుల చెల్లింపు గడువులు ఇవీ..
» ఆలస్య రుసుము లేకుండా: అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు
» రూ.50 ఆలస్య రుసుముతో.. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు
» రూ.200 ఆలస్య రుసుముతో.. డిసెంబర్ 3 నుంచి 14 వరకు
» రూ.500 ఆలస్య రుసుముతో.. డిసెంబర్ 16 నుంచి 28 వరకు


