‘మరోసారి ఆశీర్వదించండి’

BB Patil Said To People Give Me One Chance In Elections - Sakshi

తాడ్వాయి(ఎల్లారెడ్డి): తనను మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ కోరారు. తాడ్వాయిలో ఆదివారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం మంజూరుకు తన వంతు కృషి చేశానన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తానని హామీ ఇచ్చారు.

బీబీపాటిల్‌ను భారి మెజారిటీతో గెలిపించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. ఎంపీపీ బసంత, జెడ్పీటీసీ మద్ది సావిత్రి, రుద్రమదేవి, రవీందర్‌రెడ్డి సతీమణి మంజుల, పులుగం సాయిరెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్యాంరావు, వెంకట్‌రాంరెడ్డి, సాయిరెడ్డి, గడ్డం రాంరెడ్డి, నర్సారెడ్డి, గోపాల్‌రావు, రఘుపతిరెడ్డి, సంజీవులు, నర్సింలు, జైపాల్‌రెడ్డి, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top