హరితహారంలో పాల్గొన్న బాబు మోహన్ | babu mohan attended haritha haram in | Sakshi
Sakshi News home page

హరితహారంలో పాల్గొన్న బాబు మోహన్

Jul 13 2016 5:02 PM | Updated on Apr 4 2019 5:45 PM

మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం చేపట్టిన హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాబూమోహన్ అందరినీ ఉత్సాహపరిచారు.

మెదక్ : మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం చేపట్టిన హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాబూమోహన్ అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజే ఏడువేల మొక్కలను గ్రామంలో నాటారు. ఆయనతోపాటు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, రాష్ట్ర హరితహారం ఇంచార్జి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం నుంచి చౌదరి చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడుగునా జనంతో రహదారి నిండిపోయింది. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, పాటలతో ప్రముఖులకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement