ఘనంగా బాబుజగ్జీవన్‌రాం వర్ధంతి

Babu Jagjivan Ram Death Anniversary In Karimnagar - Sakshi

కరీంనగర్‌: మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌రాం 32వ వర్ధంతిని శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ హాజరై నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ వ్యవసాయశాఖమంత్రిగా దేశాన్ని అభివృద్ధిలో నడిపించారని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ మాట్లాడుతూ జగ్జీవన్‌ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న మహనీయుడని కొనియాడారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రవి ఆధ్వర్యంలో బాబుజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆరెపల్లి మోహన్, ఆకుల ప్రకాశ్, కర్ర రాజశేఖర్, దిండిగాల మధు, వెన్న రాజమల్లయ్య, గందె మాధవిమహేశ్, బాకారపు శివయ్య, మాదాసు శ్రీనివాస్, చింతల కిషన్, టేల భూమయ్య, సదానందంనాయక్, లక్ష్మీనారాయణ, దాసరి సత్యనారాయణ, ఎర్రోళ్ల శ్రీనివాస్, పెద్దెల్లి ఆంజనేయులు  పాల్గొన్నారు.
 
జగ్జీవన్‌రామ్‌కు నివాళి 
కరీంనగర్‌:  బాబుజగ్జీవన్‌రాం వర్ధంతిని శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి నివాళి అర్పించారు. దళిత సంఘాల నాయకులు కల్లెపల్లి శంకర్, ఎమ్మార్పీఎస్‌  జిల్లా నాయకులు గోష్కి శంకర్, కామారపు శ్యామ్, మనోహర్, గడ్డం కొమురమ్మ, దుబ్బ నీరజ, ఎమ్మార్పీఎస్‌ నగర అధ్యక్షుడు గోష్కి అజయ్, అంబేద్కర్‌ యువజన సంఘం నగర అధ్యక్షుడు రమేశ్, కోహెడ వినోద్, ఇల్లందు మొండయ్య, గాలిపల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top