గులాబీ గూటికి వెంకట్రావ్ | B.venkat rao joined in trs party | Sakshi
Sakshi News home page

గులాబీ గూటికి వెంకట్రావ్

Aug 25 2014 1:20 AM | Updated on Sep 2 2017 12:23 PM

ఎమ్మెల్సీ, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద ్ధమైంది.

రామకృష్ణాపూర్ : ఎమ్మెల్సీ, ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకట్రావ్ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద ్ధమైంది. ఆయనతోపాటు కోల్‌బెల్ట్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దసంఖ్యలోనే గులాబీ కండువా కప్పకోనున్నారు. ఈ నెల 30న టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నా.. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సింగపూర్ పర్యటనలో ఉండడంతో ఆయన హైదరాబాద్ రాగానే పూర్తిస్థాయిలో ప్రకటన వచ్చే అవకాశముంది.

సింగరేణి కార్మికులకు నాలుగు దశాబ్దాలకు పైగా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా సేవలందించిన వెంకటావ్‌క్రు కోల్‌బెల్ట్ ఏరియాలో మంచి పట్టు ఉంది. సీనియర్ కార్మికనేతగా పేరున్న ఆయన టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన క్రమంలో కార్మిక క్షేత్రమైన చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా కోలుకోలేని దెబ్బ తగిలినట్లవుతుంది. ఆయన తోపాటే ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ దాని అనుబం ధ సంఘాల నాయకులు కూడా పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదే విషయమై ఎమ్మెల్సీ వెంకట్రావ్ ను ఆదివారం ఫోన్లో సంప్రదించగా.. టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని అయితే ప్రస్తుతం కేసీఆర్ సింగపూర్ పర్యటనలో ఉన్నందున ఈ నెల 26న ఆయనతో భేటీ అయిన పిదప ఏ తేదీలో చేరేది ఖరారవుతుందని తెలిపారు. తనతోపాటు జిల్లాకు చెందిన మరికొందరు టీడీపీ ముఖ్యనాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement