మద్యానికి బానిసై ఆత్మహత్య | auto driver suicide due to unhealthy | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై ఆత్మహత్య

Oct 21 2015 4:35 PM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలో బుధవారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు.

గోదావరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖని మండలంలో బుధవారం ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించాడు. అడ్డగుంటపల్లి గ్రామానికి చెందిన నవీన్(33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

గత కొంతకాలంగా మద్యానికి బానిసైన నవీన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement