ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి | attack on women due to harassments | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

Jul 26 2017 1:19 AM | Updated on Mar 28 2018 11:26 AM

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి - Sakshi

ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిపై యువకుడు కత్తితో దాడి చేశాడు.

కేశంపేట (షాద్‌నగర్‌): తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. మీనమోనిపల్లికి చెందిన ఆనెపోసల జంగయ్య, పాపమ్మ దంపతుల చిన్న కూతురు సునీత(21) కడ్తాల పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తలకొండపల్లి మండలం రాంపూర్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌ తనను ప్రేమించాలంటూ సునీతను వేధిస్తున్నాడు. విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సునీత తల్లి ఏడాది క్రితం శివకుమార్‌ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రుల ముందే మందలించింది.

అయినా శివ తీరు మారకపోవంతో చేసేదేమీ లేక సునీత కళాశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటూ పరీక్షలకు హాజరవుతోంది. దీంతో ఎటూ తోచని శివ మంగళవారం మీనమోనిపల్లికి వచ్చాడు. గ్రామంలో తల్లితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్న సునీత వద్దకు చేరుకుని వెంట తెచ్చుకున్న కత్తితో నాలుగుసార్లు పొడిచి అక్కడ నుంచి పరారయ్యడు. సునీతను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. శివకుమార్‌ నేరుగా ఆమన్‌గల్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.

 

Advertisement
 
Advertisement
Advertisement