డబ్బుల్లేని ఏటీఎంలు | ATM machines money nill every first month | Sakshi
Sakshi News home page

డబ్బుల్లేని ఏటీఎంలు

Jun 6 2016 2:59 AM | Updated on Sep 2 2018 4:23 PM

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు పరేషాన్ అవుతున్నాయి.

ప్రతినెలా కార్మికుల పరేషాన్
►  వేతనాల సమయంలోనే పరిస్థితి


యైటింక్లయిన్‌కాలనీ : ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో కార్మిక కుటుంబాలు పరేషాన్ అవుతున్నాయి. అత్యధిక సింగరేణి కార్మిక కుటుంబాలు నివాసముంటున్న యైటింక్లయిన్‌కాలనీలో ఈపరిస్థితి ప్రతినెలా వేతనాల సమయంలో సర్వసాదారణంగా మారుతోంది. సిం గరేణి కార్మికులకు యాజమాన్యం నెలవారీ వేతనాలను ప్రతినెల 4లోగా ఖాతాల్లో జమచేస్తుంది. వేతనాలను తీసుకునేందుకు ఏటీఎంల వద్దకు వెళ్లిన కార్మికులకు అందులో డబ్బులు లేక నిరాశగా వెనుదిగాల్సి వస్తోం ది. ముఖ్యంగా యైటింక్లయిన్‌కాలనీ, మహాకవిపోతనకాలనీలో ఏర్పా టు చేసిన ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలలో ఈపరిస్థితి ఎక్కువగా ఉంటోం ది.

పోతనకాలనీలో ఏర్పాటు చేసిన స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో యంత్రంపైనున్న 1,2,7 నంబర్లు సరిగా పనిచేయక వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 40రోజులుగా ఈయంత్రం ఇదేవిధంగా ఉం టున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని గుర్తింపు, ప్రాతి నిధ్య సంఘాల నాయకులు ఐలి శ్రీనివాస్, నాచగోని దశరధంగౌడ్ పేర్కొన్నారు. దీనిపై సంబందిత అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం పట్టించుకొని కార్మికులు ఇబ్బంది పడకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement