నైటీలో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టారు | Kamareddy: Masked miscreants in nighties loot SBI ATM | Sakshi
Sakshi News home page

నైటీలో వచ్చి ఏటీఎంను కొల్లగొట్టారు

Oct 12 2026 5:37 AM | Updated on Oct 12 2026 5:37 AM

Kamareddy: Masked miscreants in nighties loot SBI ATM

గాంధారి ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ

గ్యాస్‌కట్టర్‌తో మెషీన్‌ ధ్వంసం.. డబ్బు చోరీ

గాంధారి(ఎల్లారెడ్డి): నైటీలు ధరించి, ముఖాలకు మాస్క్‌లు, కళ్లజోళ్లు పెట్టుకొని దుండగులు ఏటీఎంను కొల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లని స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు మండల కేంద్రంలోని గాంధారి–బాన్సువాడ ప్రధాన రహదారిలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడ్డారు. మొదట ఏటీఎం మెషీన్‌పై ఏదో రసాయనం చల్లారు. ఆ తర్వాత గ్యాస్‌ కట్టర్‌తో మెషీన్‌ను ధ్వంసం చేసి.. అందులో ఉన్న డబ్బులను అపహరించుకుపోయారు.

ఆదివారం ఉదయం ఘటనా స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ విఠల్‌ రెడ్డి, ఎస్‌ఐ మహేందర్‌ పరిశీలించారు. అయితే ఏటీఎంలో ఎంత డబ్బు ఉన్నది బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు తేల్చలేదు. శుక్రవారం రూ.10 లక్షలు ఏటీఎంలో పెట్టినట్లు బ్యాంకు అధికారులు ఎస్‌ఐకి తెలిపారు. అయితే అందులో నుంచి ఎంత డబ్బు డ్రా చేశారు, బ్యాలెన్స్‌ వివరాలను బ్యాంకు అధికారులు తెలుపలేదని ఎస్‌ఐ తెలిపారు. దుండగుల కోసం పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement