కలెక్టరేట్‌ ముట్టడించిన ఆశావర్కర్లు | asha workers protests at collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడించిన ఆశావర్కర్లు

Sep 23 2015 2:40 PM | Updated on Sep 3 2017 9:51 AM

కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.

కరీంనగర్: కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలోని ఆశా వర్కర్లు బుధవారం నాడు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి భారీసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కలెక్టరేట్ గేటు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆశావర్కర్లకు మధ్య స్వల్ప  తోపులాట చేసుకుంది. సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించటంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement