మేడారం.. ఏర్పాట్లకు శ్రీకారం | Arrangements made Medaram | Sakshi
Sakshi News home page

మేడారం.. ఏర్పాట్లకు శ్రీకారం

Jan 30 2015 1:21 AM | Updated on Oct 9 2018 5:58 PM

మేడారం.. ఏర్పాట్లకు శ్రీకారం - Sakshi

మేడారం.. ఏర్పాట్లకు శ్రీకారం

ఫిబ్రవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న మేడారం మినీ జాతరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఫిబ్రవరి 4 నుంచి మినీ జాతర వసతుల కల్పనకు సన్నద్ధమైన అధికారులు
స్నానఘట్టాల వద్ద షవర్ల నిర్మాణ పనులు షురూ
గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు..
తాగు నీటి సరఫరాపై కసరత్తు

 
మేడారం (తాడ్వాయి) : ఫిబ్రవరి 4 నుంచి 7వ తేదీ వరకు జరగనున్న మేడారం మినీ జాతరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. స్నానఘాట్టాల వద్ద స్నానాలు చేసేందుకు వీలుగా ఐటీడీఏ మైనర్ ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పనులకు శ్రీకారం చుట్టారు. జంపన్నవాగులో వెల్ ఫౌండేషన్ బావి మోటా ర్ల ద్వారా తాత్కాలికంగా నీటి షవర్ల ఏర్పాటు కు సంబంధించి గురువారం రెండు మోటార్లు, ప్లాస్టింగ్ పైపులను మేడారానికి తీసుకువచ్చారు. 5 నిమిషాల్లో 60 మంది భకు ్తలు స్నానాలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని మైనర్ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయంకల్లా షవర్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.

వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తులకు నీడ కల్పించేందుకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తడుకలతో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగు నీటి వసతి కల్పించేందు కు చర్యలు చేపట్టినట్లు  ఈఓ మల్లేశం తెలిపారు. నల్లాల ద్వారా తాగు నీరు సరఫరా అయ్యే లా ట్రైబల్ వేల్ఫేర్ శాఖ ద్వారా రెండు రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు  ఏఈ అబిద్‌ఖాన్ తెలిపా రు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేతిపంపులకు హ్యాండిల్ బిగించడం పూర్తయ్యాయి.  అదేవిధంగా జాతర ప్రాంతంలో విడిది చేసే భక్తులకు ట్యాంకుల ద్వారా తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. మినీ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లకు సంబంధించి ఎస్సై సాంబమూర్తి పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని తెలిపారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement