
సంతోష్‌కుమార్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న నాగేశ్వర్‌రావు
వాంకిడి(ఆసిఫాబాద్) : టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వాంకిడి జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు బుధవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర, గ్రామీణ ప్రాంతాల సమస్యలను రాజ్యసభలో చర్చించాలని కోరినట్లు అరిగెల నాగేశ్వర్‌రావు ఫోన్‌ద్వారా విలేకరులకు తెలిపారు.