నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు | Are there no electricity supply today? | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు

Sep 27 2017 2:33 PM | Updated on Sep 18 2018 8:41 PM

Are there no electricity supply today? - Sakshi

మేడ్చల్‌, ఘట్‌కేసర్‌ టౌన్‌: ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో నేడు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయనున్నట్లు ఘట్‌కేసర్‌ ట్రాన్స్‌కో ఏఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. విద్యుత్‌ లైన్లకు మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదులాబాద్, మర్పల్లిగూడ, కొత్తగూడ, చందుపట్లగూడ, పోతరాజుగూడ, అంకుషాపూర్, మాదారం, ఎన్‌ఎఫ్‌సీనగర్, బొక్కెనిగూడ, అవుషాపూర్‌ గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని, అంతరాయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement