ఏపీసెట్ సప్లిమెంటరీ ఫలితాలు లేనట్టే! | apset supplementary results | Sakshi
Sakshi News home page

ఏపీసెట్ సప్లిమెంటరీ ఫలితాలు లేనట్టే!

May 5 2014 12:43 AM | Updated on Mar 28 2019 5:39 PM

ఏపీసెట్-2013 సప్లిమెంటరీ ఫలితాల విడుదల లేనట్టేనని తేలిపోయింది.

సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-2013 సప్లిమెంటరీ ఫలితాల విడుదల లేనట్టేనని తేలిపోయింది. గత ఏడాది నవంబరు 24న జరిగిన ఏపీసెట్ ఫలితాలను ఫిబ్రవరి 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. యూజీసీ నిబంధనల ప్రకారం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో 15 శాతం మందినే ఏపీసెట్‌లో అర్హులుగా ప్రకటించారు. దీంతో ఈ పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నా.. 15 శాతం నిబంధన కారణంగా అర్హత పొందలేక అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోయారు.
 
 దీనిపై విద్యార్థి సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ సెట్ చైర్మన్, ఉస్మానియా వీసీ సత్యనారాయణ మరో ఐదు శాతం ఫలితాల పెంపునకు అనుమతి కోసం యూజీసీకి లేఖ రాశారు. ఈ లేఖ రాసి మూడు నెలలైనా యూ జీసీ నుంచి సమాధానం రాలేదు. దీంతో సప్లిమెంటరీ ఫలితాలకు అవకాశం లేదని ఏపీసెట్ సభ్య కార్యదర్శి ప్రొ.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement