ఏపీ వ్యాట్ ఇక తెలంగాణ వ్యాట్ | AP Vat Law Transferred to Telangana | Sakshi
Sakshi News home page

ఏపీ వ్యాట్ ఇక తెలంగాణ వ్యాట్

Oct 16 2014 2:32 AM | Updated on Sep 2 2017 2:54 PM

ఏపీ వ్యాట్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఏపీ వ్యాట్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి బదలాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్1వ తేదీ వరకు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన ఏపీ వ్యాట్ చట్టం-2005ను తెలంగాణ రాష్ట్రానికి అన్వయిస్తూ అమలు చేస్తున్నట్లు ఉత్తర్వు(జీవో నంబర్ 32)ల్లో పేర్కొంది.

ఈ మేరకు ప్రభుత్వం 16న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇకపై ‘ఏపీ వ్యాట్ యాక్ట్ - 2005(తెలంగాణ అడాప్షన్) ఆర్డర్, 2014’గా తెలంగాణలో అమలు కానుంది. ఈ చట్టంలో 8వ సెక్షన్ ఐటెం (డి)లో సోయాబీన్ డియోలెడ్ కేక్ అమ్మకాలను ప్రభుత్వం కొత్తగా చే ర్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement