సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 20 లక్షల విరాళం

AP State Financial Corporation Telangana Division Contributed Rs 20 Lakh To TSCMRF - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా ఇంతవరకు ఎ‍ప్పుడు ఎదుర్కొని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ విధించడంతో ఆయా ప్రభుత్వాలు అనేక సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అనేక సంస్థలు, సామాన్యులు కూడా అండగా నిలుస్తున్నారు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు, సంస్థలు పీఎం కేర్‌కి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి విరాళాలు అందిస్తున్నాయి. (సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌ (ఎస్‌ఎఫ్‌సీ - తెలంగాణ విభాగం) తమ వంతు బాధ్యతగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలను అందజేసింది. కోవిడ్‌-19 నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా కార్పొరేషన్ తరఫున ఈ విరాళం అందజేసినట్లు కార్పొరేషన్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేముల శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శ్రీనివాసులతో పాటు కార్పొరేషన్‌ ఎగ్జికూటివ్‌ డైరెక్టర్‌ దేవానంద్‌ శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. అదేవిధంగా, ఎస్‌ఎఫ్‌సీ ఉద్యోగులు, సిబ్బంది సైతం ముందుకొచ్చి తమ ఒకరోజు వేతనం 3.8 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్‌ను అసోసియేషన్‌ అధ్యక్షుడు రాధాకృష్ణ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

(కస్టమ్స్అండ్సెంట్రల్జీఎస్టీ గెజిటెడ్ఆఫీసర్స్రూ.70 లక్షల విరాళం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top