కేంద్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వాలు

Anti-personnel governments at the center - Sakshi

అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ధ్వజం

డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో ధర్నా

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రభుత్వాలు 15 ఏళ్లుగా ఉద్యోగుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయ ని అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మం డిపడింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ధర్నాలో తెలంగాణ, ఏపీ ఎన్జీవో సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీపీఎస్‌ రద్దు, ఆదాయపన్ను పరిమితి పెంపు, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రధాన డిమాండ్‌గా సాగిన ఈ ధర్నాలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలను నేతలు ఎండగట్టారు. తెలంగాణ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడమే తమ ప్రధాన డిమాండ్‌ అని ఆయన తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వాలు తీసుకుంటున్న వ్యతిరేక విధానాల వల్ల 1.23 లక్షల మంది ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. ఆదాయపన్ను పరిమితి రూ.5 లక్షలే ఉండటం వల్ల ఏడాదిలో 3 నెలల జీతాన్ని పన్ను కింద ఉద్యోగులు చెల్లించాల్సి వస్తోం దని పేర్కొన్నారు. అందువల్ల ఉద్యోగులకు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లోపు ఉద్యోగుల పక్షాన నిలిచే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ ధర్నాలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాజేందర్, హైదరాబాద్‌ సిటీ అధ్యక్షుడు ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు. ఏపీ నుంచి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top